ఫిరాయింపులతో అసెంబ్లీ గౌరవం దిగజారుతోంది

హైదరాబాద్ః రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల అవసరాల కోసం శాసనసభలో పోరాటం కొనసాగిస్తున్న ప్రతిపక్షాన్ని ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. సభా మర్యాదల పేరిట తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనుకునే కుట్రలు, కుతంత్రాలు మానుకొని ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బాబుతో ఫోటోలు తీసుకుంటే వారిపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులతో అసెంబ్లీ గౌరవం దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం గొంతు నులిపేలా వ్యవహరించడం ప్రభుత్వానికి తగదని విశ్వేశ్వరరెడ్డి హితవు పలికారు. 

తాజా ఫోటోలు

Back to Top