శాసనసభ ప్రజల సభ

న్యూఢిల్లీ) శాసనసభ
అనేది ప్రజల సభ అని, అది వ్యక్తుల సభ కానే కాదని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది.
ప్రజల విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. శాసనసభ
నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకొన్న అక్రమ నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే రోజా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై
ఆమె హైకోర్టుని ఆశ్రయించి తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లారు. శాసన వ్యవస్థ
పనితీరులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవటం సీరియస్ అంశమని వ్యాఖ్యానించింది.
ఇరుపక్షాలు ఒక అవగాహనకు వస్తే మంచిదని అభిప్రాయ పడింది. ఉద్వేగాలు ఏర్పడినప్పుడు
రెండు పక్షాలు సమన్వయం చేసుకోవటం మంచిదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ మీద నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది. 

Back to Top