నాలుగోరోజు అట్టుడుకిన అసెంబ్లీ

చంద్రబాబు కనుసన్నల్లో అసెంబ్లీ సమావేశాలు
ప్రతిపక్షంపై మంత్రుల దాదాగిరి..!

డోంట్ టచ్ మీ అంటే భూతా..!
ఇవాళ అసెంబ్లీలో జీరో అవర్ లో ఆసక్తికర చర్చ జరిగింది. డోంట్ టచ్ మీ అంటే భూతు మాటా కాదో స్పష్టత ఇవ్వాలని ఓ సభ్యుడు కోరారు. డోంట్ టచ్ మీ అన్నందుకు కేసులు నమోదవుతున్నాయని ఆయన అన్నారు. ఐతే,ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి డోంట్ టచ్ మీ అన్నందుకు ఆయనపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. 

కరువుపై వైఎస్ జగన్ ఏకరవు..ప్రభుత్వం ధిక్కారం..!
కరువుపై ఇవాళ అసెంబ్లీ దద్దరిల్లింది. కరువు అంశంపై వైఎస్ జగన్ మాట్లాడుతుండగా..పలుమార్లు మైక్ కట్టయ్యింది. అధికారపార్టీ సభ్యులు జగన్ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు.  రాష్రంలో కరువుతో 197 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.

నాలుగోరోజు సేమ్ సీన్ రిపీట్..!వైఎస్సార్సీపీ వాకౌట్

అసెంబ్లీలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాలు వాయిదాలకే పరిమితమయ్యింది. వైఎస్సార్సీపీ లేవనెత్తిన ఏం అంశాలపైనా ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోగా....ప్రతిపక్షసభ్యులపై దూషణల పర్వానికి దిగింది.  సమావేశాలను అడ్డుకోవడమే ధ్యేయంగా ప్రభుత్వనేతలే పనిచేయడం దురదృష్టకరం. చంద్రబాబు కనుసన్నల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణం. ప్రజారంజకంగా పాలన సాగించాల్సింది పోయి ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షం గొంతు నొక్కడం ఘోరం. ప్రజల ముందు ఎక్కడ దోషులుగా నిలబడతామోనని, తమ అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందోనని పాలకపక్షం ప్రతిక్షణం సభను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ప్రతిపక్షసభ్యులకు విలువ ఇవ్వకుండా సభా నియమాలను ఉల్లంఘిస్తూ దౌర్జన్యఖాండ ప్రదర్శించారు. 

ప్రతిపక్షంపై దూషణలు,చర్చలకు ఆటంకం..ఇదే టీడీపీ ఫార్ములా..!
కరువు, నిత్యవసర ధరలపై చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ  వాయిదా తీర్మానం ఇవ్వగా దాన్ని తోసిపుచ్చారు. ప్రతిపక్ష సభ్యులు చర్చకోసం గట్టిగా పట్టుబట్టగా స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమయిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు ప్లాన్ ప్రకారం ప్రతిపక్షంపై దాడి చేశాడు.  సభను అడ్డుకునే వ్యూహంలో భాగంగా వైఎస్సార్సీపీని సైకో పార్టీగా మార్చుకోవాలంటూ నోటికి పనిచెప్పాడు. దీనిపై అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ సభలో నిరసనకు దిగంది. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అచ్చెన్నాయుడుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. మంత్రి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు  చేతిసైగలతో, కనుగుడ్లు పెద్దవి చేసి బెదిరించినా తమదే తప్పన్నట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్.

హడావిడిగా బిల్లు ఆమోదించాలట..!
రెండోసారి వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది.  బిల్లుల పేరుతో మరో హైడ్రామాకు పచ్చప్రభుత్వం తెరతీసింది.   ప్రతిపక్షానికి కనీస సమాచారం ఇవ్వకుండా బిల్లులను హడావిడిగా తీసుకువచ్చింది. ఎలాంటి చర్చ, పరిశీలన లేకుండా బిల్లుల ఆమోదానికి తాము విరుద్ధమని  వైఎస్ జగన్  అన్నారు. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లు ప్రతులను కనీసం వారం రోజుల ముందు సభలో ఇవ్వాలి. కానీ అలా ఇవ్వకుండా ఎలాంటి చర్చ లేకుండా అప్పటికప్పుడు బిల్లు ఎలా తీసుకొస్తారని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభా నియమాలకు విరుద్ధంగా బిల్లులు సభలో ప్రవేశపెట్టడాన్ని జగన్ తప్పుబట్టారు.  బిల్లులోని లోటుపాట్లపై సమర్థవంతంగా చర్చ జరగాలి, సవరణ చేయాల్సి ఉంటుందని జగన్ అన్నారు. కానీ అవేమీ పాటించకుండా ప్రభుత్వం సడన్ గా బిల్లులు తీసుకొచ్చి దొడ్డిదారిన పాస్ చేసుకునే ప్రయత్నం చేయడం అవివేకమన్నారు. 

ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక ఢీలా..!
అసలు ప్రభుత్వం ఎటు పోతుంది, ఏ ఉద్దేశ్యంతో పనిచేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులైనా నిర్వహించాలని ముందు నుంచి వైఎస్సార్సీపీ కోరుతోంది. కానీ ప్రభుత్వం మొండివైఖరితో సమావేశాలను ఐదురోజులకు మాత్రమే కుదించింది. సభలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక, ప్రజాసమస్యలపై చర్చించే ధైర్యం లేక ఆదరాబాదరగా ఐదురోజుల పాటు సమావేశాలు ముగించుకునేందుకు చంద్రబాబు సర్కార్ తెగ తాపత్రయపడుతోంది.  

తాజా వీడియోలు

Back to Top