మరో సారి వాయిదా పడిన అసెంబ్లీ

హైదరాబాద్) శాసనసభ మరోసారి వాయిదా పడింది. లక్షల కుటుంబాల ఉసురు పోసుకొన్న అగ్రి గోల్డ్ కుంభకోణం మీద అసెంబ్లీలో చర్చించాలని వైెఎస్సార్సీపీ ప్రతిపాదించింది. ఈ మేరకు వాయిదా తీర్మానం కోరుతూ నోటీసు ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం అంగీకరించకుండా మొండి పట్టు పడుతోంది. దీన్ని వాయిదా తీర్మానం కింద చర్చించాలని వైెఎస్సార్సీపీ సభ్యులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. దీంతో శాసనసభ వాయిదా పడింది. తర్వాత సభ సమావేశమైనప్పటికీ ప్రభుత్వ పక్షం మొండి పట్టు వీడలేదు. వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. సభ మరోసారి వాయిదా పడింది. 
Back to Top