ఏపీ అసెంబ్లీ మరోసారి వాయిదా

అసెంబ్లీలో కాల్ మనీ సెక్సు
రాకెట్ వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పూర్తిగా తప్పులు చేసిన తెలుగుదేశం
వ్యవహారాన్న పక్క దారి పట్టించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. రెండోసారి సభ
ప్రారంభం అయ్యాక ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ ను రాజకీయాలకు
వాడుకోవటం తప్పని హితవు పలికారు. ఈ దశలో ప్రతిపక్ష నాయకుని ప్రసంగానికి టీడీపీ
సభ్యులు అడ్డు తగిలారు. కాల్ మనీ అంశాన్ని పక్క దారి పట్టించేందుకు వైఎస్సార్సీపీ
సభ్యులు కెమెరాలకు అడ్డు తగిలారంటూ ఆరోపణలకు దిగారు.  ఈ గందరగోళం మధ్య సభ మరోసారి వాయిదా పడింది.  

Back to Top