వాయిదా తీర్మానాల తిరస్కరణ, సభ వాయిదా

శాసనసభ సమావేశాల మొదటి రోజు కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశం సభను కుదిపేసింది. అధిక వడ్డీలకు రుణాలు ఇవ్వటం, ఆ ముసుగులో మహిళల్ని లోబరుచుకోవటం, అత్యాాచారాలకు పాల్పడటం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశం కింద వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ చర్యల్ని తూర్పార బట్టారు. నిందితులతో స్వయంగా ముఖ్యమంత్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ దిగిన ఫోటోల్ని చూపించారు.ఈ  దశలో అధికార తెలుగుదేశం సభ్యులు గొడవకు దిగారు. గందరగోళం మధ్యే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్, సభను కొద్దిసేపు వాయిదా వేశారు. 
Back to Top