హైదరాబాద్) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అగ్రి గోల్డ్ కుంభ కోణం మీద వాయిదా తీర్మానం కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పట్టు పట్టింది. లక్షల ప్రజలకు సంబంధించిన అంశం కావటంతో దీని మీద దృష్టి సారించాలని విన్నవించారు. ప్రభుత్వం మోకాలడ్డు పెట్టడంతో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీనికి అనుమతి లభించలేదు. చివరకు సభ వాయిదా పడింది.