ఆస్పత్రి ఐసీయూ నుంచే ఉద్యమానికి ఆక్సీజన్..!

పోరాట కార్యాచరణ ప్రకటించిన వైఎస్సార్సీపీ..
రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు,ర్యాలీలు, రిలేదీక్షలు..!


గుంటూరుః చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేసి దీక్షను భగ్నం చేసినా ఆస్పత్రి ఐసీయూ నుంచే  వైఎస్ జగన్ ప్రత్యేకహోదా ఉద్యమానికి ఆక్సీజన్ అందిస్తున్నారు. వైఎస్ జగన్ సూచన మేరకు ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఈమేరకు కార్యచరణ వివరాలను  మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

అధినేత ఆదేశాల మేరకు..!
బుధవారం సాంయంత్రం 3 గంటలకు  విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్ నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకూ నిరసన మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ నిరసన మార్చ్లో వైఎస్సార్సీపీ  ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలంతా  పాల్గొంటారని అంబటి రాంబాబు తెలిపారు. అదేవిధంగా ఈనెల 17 నుంచి 21 వరకూ అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు జరపనున్నట్లు ప్రకటించారు.  18న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, 19న నియోజకవర్గ కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనున్నారు. 20వ తేదీ సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ తీస్తారు.  21న బస్సు డిపోల ముందు ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. 

భవిష్యత్ కార్యాచరణ..!
ప్రత్యేకహోదా కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై...ఇవాళ వైస్సార్సీపీ కీలక నేతలు గుంటూరులో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదించి  పోరాట కార్యాచరణ ప్రకటించారు.  వైఎస్ జగన్ చేపట్టిన నిరాహారదీక్షను బలవంతంగా విరవింపజేసిన నేపథ్యంలో ...  వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. 

తాజా వీడియోలు

Back to Top