చంద్రబాబు తొత్తుగా మారిన అశోక్‌బాబు

అనంతపురం: చంద్రబాబుకు ఏపీఎన్డీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు తొత్తుగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల అంగీకారం లేకుండానే అమరావతి పేరుతో రూ. 2 వందల కోట్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అనంతలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా పీఆర్‌సీ బకాయిలు ఇవ్వలేదు.. ఇప్పుడు పెన్షనర్ల డబ్బులు పట్టుకుంటామంటే ఎలా అని నిలదీశారు. ఎమ్మెల్సీ పదవి కోసం అశోక్‌బాబు ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని ధ్వజమెత్తారు. అశోక్‌బాబు వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలంతా తిరగబడాలని.. చంద్రబాబు స్వార్థం కోసం అశోక్‌బాబు లాంటి వ్యక్తులను అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 
Back to Top