ఆశా వర్కర్ల నిర్బంధం


విజయవాడ) న్యాయం కోసం రోడ్డు ఎక్కిన ఆశా
వర్కర్లను పోలీసులు నిర్బంధించారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన
చలో విజయవాడ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.విజయవాడలోనితుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున
300 మంది ఆశా వర్కర్లు చలో కార్యక్రమంలో
పాల్గొనడానికి బయలు దేరారు. రంగంలోకి
దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్
హాల్ లో నిర్బంధించారు. మూకుమ్మడిగా ఒకేచోట బంధించటంతో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. 

Back to Top