అసెంబ్లీ మరోమారు వాయిదా

హైదరాబాద్ : ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశమైన శాసనసభ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో మరోసారి వాయిదా పడింది. తొలుత ఉదయం తొమ్మిదిగంటలకు ప్రారంభమైన అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం కోరుతూ టీఆర్‌ఎస్‌ సభ్యులు సభలో పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం ఎదుట నిలబడి ఆందోళనకు దిగారు. తెలంగాణపై తీర్మానం కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో.. టిఆర్‌ఎస్‌, టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. సమావేశాల చివరిరోజైనా సహకరించాలని స్పీకర్‌ పదేపదే విజ్ఞప్తిచేశారు. అయినా సభ్యులు తమపట్టు వీడకపోవడంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు సభను సజావుగా సాగనివ్వాలని శాసనసభా వ్యవహారాలశాఖా మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. తిరిగి ప్రారంభమైనా టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టువీడకపోవడంతో స్పీకర్‌ రెండోసారి కూడా సభను గంటపాటు వాయిదా వేశారు. దీంతో శాసనసభ వర్షాకాల సమావేశాల చివరిరోజు కూడా విపక్ష సభ్యులు సభలో ఆందోళనతో సభలో ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు.

Back to Top