అసెంబ్లీ ప్రాంగ‌ణం లో వైఎస్సార్‌సీపీ ఆందోళ‌న‌


హైద‌రాబాద్‌ : అసెంబ్లీ నుంచి దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి
చిత్ర‌ప‌టాన్ని తొల‌గించ‌టాన్ని నిర‌సిస్తూ వైఎస్సార్‌సీపీ ఆందోళ‌న
చేప‌ట్టింది. ఈ ఉద‌యం ఆసెంబ్లీ కు చేరుకొని, స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద్ ను
క‌ల‌వాలని భావించారు. స్పీక‌ర్ అందుబాటులో లేకపోవ‌టంతో అసెంబ్లీ
కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ ను క‌లిశారు. ప‌ద‌విలో ఉండ‌గా మ‌ర‌ణించిన ఏకైక
ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని, అందుచేత‌నే ఆయ‌న చిత్ర‌ప‌టాన్ని
అసెంబ్లీ లాంజ్ లో ఏర్పాటు చేస్తున్న‌ట్లు గ‌త స్పీక‌ర్ ప్ర‌క‌టించార‌ని
గుర్తు చేశారు. అడ్డ‌గోలుగా ఆయ‌న చిత్ర‌ప‌టాన్ని తొల‌గించ‌టం త‌గ‌ద‌ని
స‌త్య‌నారాయ‌ణ‌కు హిత‌వు ప‌లికారు. త‌ర్వాత కార్య‌ద‌ర్శి విభాగం కు ఎదురుగా
వైఎస్సార్సీపీ నాయ‌కులు ఆందోళ‌న నిర్వ‌హించారు.
Back to Top