ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న జగన్ ప్రకటనపై హర్షం

మాచవరం (మంగళగరి) : నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా వైయస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ ద్వారా ఆర్యవైశ్యుల్లోని పేదలను ఆర్ధికంగా ఆదుకొని , వారి ఆర్ధిక అభివృద్ధి తోడ్పడుతుందని అన్నారు. ఇప్పటి వరకు టీడీపీ ఆర్యవైశ్యుల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప వారి అభివృద్ధికి ఎలాంటి సంక్షేమ పధకాలు చేపట్టలేదన్నారు. జగన్‌ ప్రకటనతో ఆర్యవైశ్యులకు భరోసా కలిగిందన్నారు. హర్ష వ్యక్తం చేసిన వారిలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ వంకాయల లక్ష్మీనారాయణ , ఆర్యవైశ్య జిల్లా ఉపాధ్యక్షులు ఆతుకూరి భిక్షాలు , జిల్లా కార్యదర్శి వంకాయల రమేష్‌ ,ఆర్యవైశ్య పెద్దలు కట్టమూరి అంబయ్య, , గుండా సత్యన్నారాయణ, గుండా కొండలు, బచ్చు వాసుదేవరావు, కొత్త వెంకటేశ్వర్లు ఉన్నారు.

Back to Top