బాబును ఆర్యవైశ్యులు నమ్మే స్థితిలో లేరు

కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలనే మళ్లీ నంద్యాలలో చెప్పి, అవే మళ్లీ కాకినాడలో చెబుతూ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ వీరభద్రస్వామి అన్నారు. కాకినాడలో ఆర్యవైశ్యులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా ఏ ఒక్క వ్యాపారస్తుడైనా బాగుపడ్డారా అని అడిగారు. కాకినాడను స్మార్ట్‌ సిటీ చేస్తానని చెప్పడంతో వ్యాపారులంతా నమ్మారని, కానీ మూడు సంవత్సరాలు గడిచినా స్మార్ట్‌ సిటీ ఊసే ఎత్తడం లేదన్నారు. ఎన్నికల్లో గెలవాలనే దురాలోచనలో బాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని చెప్పడంతో వారంతా వైయస్‌ఆర్‌ సీపీకి ఆకర్షితులవుతున్నారన్నారు. ఇక చంద్రబాబు మాట ఏ సామాజిక వర్గానికి చెందిన వారు వినే పరిస్థితుల్లో లేరని, ఎన్ని అక్రమాలు, అన్యాయాలు చేసినా కాకినాడలో వైయస్‌ఆర్‌ సీపీ గెలుస్తుందన్నారు. రాజన్న రాజ్యం కావాలంటే అది జగనన్నతోనే సాధ్యమని, చంద్రబాబును గద్దె దించేందుకు కాకినాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 

Back to Top