కీచకులను కటకటాల్లోకి పంపాలి

కాల్ మనీ
సెక్స్ రాకెట్ నుంచి దోషులను తప్పించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రపై
ప్రజలు మండిపడుతున్నారు. వందలాది మహిళలు సీపీ కార్యాలయానికి వచ్చి
ఫిర్యాదులు చేస్తున్నా..చంద్రబాబు నిందితులను చంకన బెట్టుకొని
తిరుగుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మహిళలతో వ్యభిచారం చేయించే
స్థితికి ప్రభుత్వం దిగజారిందంటే అంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి
లేదన్నారు.  ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మాయమాటలు చెబుతూ చంద్రబాబు
కేసు నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల మాన
ప్రాణాలతో చెలగాటమాడిన కీచకులను తక్షణమే కటకటాల్లోకి పంపాలని డిమాండ్
చేశారు. లేనిపక్షంలో ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

తాజా ఫోటోలు

Back to Top