ఆవిర్భావ దినోత్స‌వానికి ఏర్పాట్లు పూర్తి

హైద‌రాబాద్‌) వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్స‌వం కోసం ఏర్పాట్లు పూర్త‌య్యాయి. హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్క‌రిస్తారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చిత్ర‌ప‌టానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు, అభిమానులు హాజ‌రు కానున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
అటు జిల్లా కేంద్రాలు, నియోజ‌క వ‌ర్గ కేంద్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం నిర్వ‌హించునున్నారు. ఆయా ప్రాంతాల్లోని పార్టీ ముఖ్య నాయ‌కులు కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించనున్నారు., 


Back to Top