500 మందికి పైగా అరెస్టులు

హైదరాబాద్‌) ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ‌లే స్వ‌చ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా మీద టీడీపీ, బీజేపీ ప్ర‌భుత్వాలు దొంగాట ఆడుతున్నందున‌కు నిర‌స‌న‌గా వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు బంద్ జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున వ‌స్తున్న స్పంద‌న చూసి టీడీపీ ప్ర‌భుత్వం క‌ల‌వ‌ర‌పాటుకు గురి అయింది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ బంద్ ను విఫ‌లం చేసేందుకు పోలీసుల్ని ఉసిగొల్పుతున్నారు. ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఆందోళ‌న చేస్తున్న వైయ‌స్సార్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద చాలా చోట్ల పోలీసులు విరుచుకు ప‌డుతున్నారు. అనేక చోట్ల ప్ర‌జ‌ల త‌ర‌పున ఆందోళ‌న చేస్తున్న నాయ‌కుల్ని అరెస్టు చేశారు. ఇప్ప‌టి దాకా అందుతున్న స‌మ‌చారం ప్ర‌కారం 500 మందికి పైగా వైయ‌స్సార్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని అదుపులోకి చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top