ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు

ఒంగోలుః ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన టీడీపీ ప్రభుత్వంపై వైయస్సార్సీపీ శ్రేణులు, ఆరోగ్యశ్రీ బాధితులు నిప్పులు గక్కారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పేద ప్రజల సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని పటిష్టం చేసే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు.  మరిన్ని విషయాలు వారి మాటల్లోనే చూద్దాం...

బాలినేని శ్రీనివాసరెడ్డి(మాజీ మంత్రి, వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు)
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అందరికీ తెలుసు. గతంలో దివంగత నేత వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బాబు అనారోగ్యశ్రీ పథకంగా మలిచారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది పేద ప్రజలకు వైద్యం చేయించిన మహానుభావుడు వైయస్ఆర్. ఆయన మరణాంతరం పథకం పేరును మార్చారు. ఆరోగ్యశ్రీ అమలుకు నోచుకోవడం లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వెళితే ఇచ్చే దానికి ఒక సంతకం, ఇవ్వనిదానికి ఒక సంతకం పెడతున్నారు. నిరుపేదల ఆరోగ్యంపై కూడా రాజకీయం చేయగల దుర్మార్గుడు చంద్రబాబు
–––––––––––––
జంకె వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే
ఆరోగ్యశ్రీ పథకం ఎలా ఉందో వైయస్‌ఆర్‌ హయాంలో చూశారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేద ప్రజల ప్రాణాలు కాపాడిన ఆరోగ్య ప్రదాత వైయస్ఆర్.   సమస్యలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. చంద్రబాబు పాలన ఏం పాలనో ఎవరికీ తెలియదు. బహుశా రాక్షసులు కూడా ఇలా పాలించివుండరేమో. వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు రైతు కుటుంబంలో ధనధాన్యాలుండేవి. అనారోగ్య సమస్యలు లేకుండా చేశారు. అలాంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా నీరుగారుస్తూ బాబు చంద్రన్న పేరు పెట్టుకుంటున్నారు. అనారోగ్యం వచ్చిందని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అర్జి పెట్టుకుంటే వైయస్‌ఆర్‌ సీపీకి నిధులు ఇవ్వడం లేదు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి అని అడిగితే లేవు అంటున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మనందరిది. 
––––––––––––
ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యే
ప్రభుత్వం ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పేద ప్రజలకు వైద్యం అందించే బృహత్తరమైన పథకానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు. దివంగత నేత వైయస్‌ఆర్‌ చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే తలమానికంగా ఉన్నాయి. పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తున్నారు. 2007 నుంచి ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉంది. లక్షలాది మంది ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకున్నారు. 938 రోగాలకు 29 విభాగాల్లో వైద్యాన్ని అందించారు. పేద ప్రజల వైద్యానికి ప్రభుత్వం సహకరించడం లేదు. ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకుండా పేదల పాలిట ప్రభుత్వం శాపంగా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైయస్‌ఆర్‌ గుర్తుకు వస్తారని చిన్నచూపు చూస్తూ బాబు ఆపథకాన్ని నీరుగారుస్తున్నారు. ఆరోగ్యశ్రీ శాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌ కాదు కోమాలో ఉన్న శ్రీనివాస్, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. ప్రజల ఆరోగ్య బాగోగులు ఏ విధంగా ఉన్నాయో కూడా పట్టించుకోవడంలేదు. కామినేని ఎంబీబీఎస్‌ ఎక్కడ చదివాడో కూడా తెలియదు. మున్నాబాయ్‌ ఎంబీబీఎస్సా, లేక శంకర్‌దాదా ఎంబీబీఎస్సా అని నిలదీశారు. ఎలుకలు కరిచి చిన్నారులు చనిపోతుంటే సహజం అంటున్నారు. చంద్రబాబుకు ఒక్కటే తెలుసు ప్రజలను మాయ చేయడం, మోసం చేయడం. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం అనుక్షణం పోరాడుతుంది. పేద ప్రజల గుండె చప్పుడు వైయస్‌ఆర్‌ సీపీ. ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు జరిగే వరకు వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుంది. 

ఆరోగ్యశ్రీ బాధితులు పడుతున్న కష్టాలను వైయస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా వారితోనే మాట్లాడించారు. 
 ––––––––––––
వెంకటేశ్వర్లు, 
ఆరోగ్యశ్రీపై ఆపరేషన్‌ చేయమని రత్నారావు ఆసుపత్రికి వెళితే, ఆరోగ్యశ్రీలు పనిచేయడం లేదు. డబ్బుల్చి చేయించుకోవాల్సిందేనని దబాయిస్తున్నారు. 

వైయస్ జగన్
గట్టిగా పోరాడుదాం అన్న. 
––––––––––––
నర్సమ్మ
నాకు ఎముకలు ఫ్యాక్చర్‌ అయ్యాయి. ఆరోగ్యశ్రీపై వెళితే పట్టించుకోవడం లేదు. ట్రీట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా వెనక్కుపంపించారు. నాభర్త చనిపోయాడు. నాకు ఒక చిన్నబాబు, పని చేస్తేనేగానీ ఇళ్లు గడవని పరిస్థితి, అనారోగ్యంతో ఎలా జీవితం నడిపించాలో అర్థం కావడం లేదు. ఆరోగ్యశ్రీ లేక నాటు వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి.

వైయస్ జగన్
ఎముకలు విరిగిపోయి రిమ్స్ ఆస్పత్రికి వెళితే ఆరోగ్యశ్రీ వర్తించదని వెనక్కి పంపిస్తున్నారు. పేద ప్రజల బాధలే బాబుకు పట్టడం లేదు. రెన్నెళ్లుగా నా బతుకేం ఏ కావాలా. నేను ఏం కావాలా అని నర్సమ్మ అడుగుతోంది. ఎక్కడ చూసినా ఇదే బాధ. గట్టిగా పోరాడుదాం తల్లి. బాబుపై ఒత్తిడి తీసుకొద్దాం. 
––––––––––––
సుజాత, కొండేపి
పెద్దపేగుకు పుండు వచ్చి అనారోగ్యం పాలయ్యాను. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. గవర్నమెంట్‌ ఆసుపత్రికి వెళితే ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లాలి అని పంపిస్తున్నారు. అప్పుల పాలయ్యాం. కొడుకు చదువు కూడా బంద్‌ చేయాల్సివచ్చింది. చదువుకోవాల్సిన మా అబ్బాయి కూలి పనికి వెళ్తున్నాడు.

వైయస్ జగన్
ప్రైవేటు ఆస్పత్రుల నుంచి 133 ప్రొసిజర్స్‌ను తీసేసి గవర్నమెంట్‌ ఆసుపత్రిలో చేస్తామని చెప్పి జీవోలు తీసుకువచ్చారు. జనరల్ సర్జరీకి సంబంధించిన థైరాయిడ్, అల్సర్ ఇంతకుముందు ప్రైవేటు ఆస్పత్రిలో ఉండే పరిస్థితిని తీసేసి గవర్నమెంట్ ఆస్పత్రిలో ఉండేట్టుగా జీవోలు తీసుకొచ్చి మార్పులు చేశారు. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్ కు డాక్టర్స్‌ అంతంత మాత్రంగానే ఉన్నారు. మందులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫెసిలిటీస్ పెంచే కార్యక్రమం బాబు చేయడం లేదు. బిల్లులు కూడా డిలేలు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులు పూర్తిగా దిగజారి పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాబు కారణంగా ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లి రూ.3 లక్షలు ఖర్చయ్యే పరిస్థితికి సుజాతమ్మ వచ్చింది. చదువుకోవాల్సిన కొడుకు చదువు మానేసి కూలికిపోయే పరిస్థితికి  వచ్చాడు అన్న అని సుజాతమ్మ చెబుతుంటే ఆరోగ్య శ్రీ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచకపోవడం మూలంగా రోగులకు సక్రమంగా వైద్యం అందని పరిస్థితి.  ఈ ధర్నా వల్ల చంద్రబాబుకు దిమ్మతిరగాలి. మానవత్వం ఆయనలో నుంచి రావాలి. పేద వాడి ఉసురు ఎలా ఉంటుందో తెలియాలి. 
––––––––––––
ఎస్వీ పాపారావు, టంగటూరు జంగలపాలెం
నా కూతురు నవోదయ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. వైద్యం చేయమంటే ఆరోగ్యశ్రీ వర్తించదు అంటున్నారు. డయాలసిస్‌ కోసం సొంత డబ్బులనే ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎనమిదిన్నర లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. నారాయణ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంది. నా కూతర్ని బతికించండి అన్న. 

 వైయస్ జగన్
తొమ్మిదేళ్ల చిన్నారి.  రెండు కిడ్నీలు పాడయితే డయాలసిస్‌ చేయాల్సిన డాక్టర్లు ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు. పాపారావు అన్న తన కూతురుకు ప్రైవేట్‌గా వైద్యం చేయించుకుంటున్నారు. ఎంపీ కోట నుంచి నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే చంద్రబాబు సిగ్గుతో తలవంచుకోవాలి. ప్రతి పేద వాడి పరిస్థితి ఇలాగే ఉంది. ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగార్చారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ గాలికొదిలేశారు. ఆరోగ్యం కోసం, చదువుకుల కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి.
Back to Top