ప్రత్యేకహోదాపై దద్దరిల్లిన అసెంబ్లీ..వైయస్ జగన్ మైక్ కట్

హైద‌రాబాద్‌: ప్రత్యేకహోదాపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఏపీకి ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు  స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.  ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ నినదించారు.  ప్రత్యేకహోదాపై చర్చకు వైయస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. హోదాపై  చర్చ చేపట్టాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు.  చంద్ర‌బాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య సభ పది నిమిషాలు వాయిదా పడింది. 

అసెంబ్లీ ప్రారంభమైనంతరం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సభలో మాట్లాడుతూ... ఇదే చ‌ట్ట‌స‌భ‌లో రెండుసార్లు ప్ర‌త్యేక హోదా కావాల‌ని తీర్మానం చేసిన విష‌యం గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్ర‌త్యేక హోదాను నీరుగార్చే ప్ర‌య‌త్నం చేయడం దారుణ‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. అరుణ్‌జైట్లీ ప్ర‌క‌ట‌న‌ను చంద్ర‌బాబు ఆహ్వానించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అని వైయ‌స్ జ‌గ‌న్ నిలదీశారు. వైయస్ జగన్ ప్రసంగిస్తుండగానే ప్రజల ఆకాంక్ష అయిన ప్రతిపక్షం గొంతు నొక్కుతూ మైక్ కట్ చేశారు.
Back to Top