బహిరంగ చర్చకు సిద్ధమా?


శ్రీకాకుళం: బోడికొండ పరిసర ప్రాంత గిరిజన  ప్రజల ముందు బహిæరంగ సమావేశం ఏర్పాటుచేసి వారి మనోభవాలకు ఎవరు అనుకూలమో, ఎవరు వ్యతిరేకమో తేల్చుకునేందుకు సిద్ధమా అని  వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగధీష్, ఎమ్మెల్యే చిరంజీవులుకు సవాల్‌ విసిరారు. గురువారం తన స్వగృహంలో విలేకర్లతో మాట్లాడుతూ బోడికొండపై గ్రానైట్‌ తవ్వకాలకు ఆ ప్రాంత గిరిజనులు వ్యతిరేకం కాదని,  వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ తమ ఉనికిని కాపాడుకోవడానికే ఉద్యమాలు చేపడుతుందని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులిచ్చేముందు. ఆ ప్రాంత గిరిజనుల మనోబాలను లె లుసుకోకుండా అడ్డగోలు అనుమతులిచ్చి కార్పోరేట్‌ శక్తులకు కొమ్ముకాసింది మీ ప్రభుత్వమేనన్నారు. ఒకవేళ గ్రానైట్‌ తవ్వకాలకు ఆ ప్రాంత గిరిజనులు అనుకూలమైతే తాము ఉధ్యమాన్ని ఇంతటితో వదిలేసి, తమ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు రాజీనామా చేసేందుకు  సిద్దంగా ఉన్నారన్నారు. వారు వ్యతిరేకమైతే మీ పదవులకు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. చవకబారు మాటలు మాని చిత్తశుద్దితో మాట్లాడాలని హితవు పలికారు. వరహాలగెడ్డ పనులకు కోటి రూపాయలు అవినీతి చేసేందుకు మీరు  సిద్దపడితే దాన్ని బయటకు తీసి వెంటనే పనులు అడ్డుకున్నామన్నారు. బోడికొండ, బడేదేవర కొండలపై గ్రాౖ¯ð ట్‌ తవ్వకాలకు అనుమతులిచ్చింది, మీహయాంలో కాదా అన్నారు. ఆ రెండు పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు మీ పార్టీకి చెందిన వారు కాదా అని ప్రశ్నించారు. బోడికొండపై పనులకు 13–04–2016న, బడేదేవరకొండపై పనుల కోసం 22–06–16న అనుమతులిచ్చారన్నారు. ఈ ప్రాంత గిరిజన ప్రజల మనోబావలకు వ్యతిరేకంగా అనుమతులిచ్చి గిరిజన బతుకులను బుగ్గిపాలు చేసేందుకు మీరే పాల్పడుతున్నారన్నారు. గిరిజన ప్రజలకు  న్యాయం జరిగేందుకు శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమను అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తున్నారన్నారు. అరెస్టులకు భయపడేది లేదని, ప్రజల కోసం ఎన్నిసార్లైనా అరెస్టయ్యేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. సర్వే రిపోర్టులను బయటపెట్టకుండా గ్రానైట్‌ యజమానులు తవ్వకాలు చేపడుతున్నా అధికారులెవ్వరూ పట్టించుకోకపోవడం అన్నాయమన్నారు. పోలీసుల సహకారంతో గ్రానైట్‌ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి అమాయక గిరిజనులను అన్యాయం చేస్తున్నారన్నారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బోను రామినాయుడు, ఎంపిటిసిలు గండి శంకరరావు, బడే రామారావు, సర్పంచ్‌ ఏగిరెడ్ది రమణమూర్తి, కౌన్సిలర్లు గొల్లు వెంకటరావు, ఎస్‌ శ్రీనివాసరావు, ఒ రామారావు,  ఆ పార్టీ నాయకులు చుక్క లక్ష్ముంనాయుడు, షేక్‌ సఫి, మండంగి రాజారావు, తాన్న శ్రీరాములు, చుక్క పోలినాయుడు, పాల్గొన్నారు.
Back to Top