వైయస్‌ జగన్‌ చేసిన సవాళ్లు స్వీకరిస్తున్నారా?

ఏపీ అసెంబ్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై గతంలో రెండు సవాళ్లు విసిరారని, వాటిని స్వీకరిస్తున్నారా అని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం సభ వాయిదా అనంతరం ప్రారంభమైన తరువాత పెద్దిరెడ్డి మాట్లాడారు.పార్లమెంటరీ సాంప్రదాయంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గతంలో మా నేత వైయస్‌ జగన్‌ కూడా రెండు  సార్లు చాలంజ్‌ విసిరారు.  పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్దామన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోయాడు కదా.. ఆ వాయిస్‌ ఆయనది కాదా?. ఈ సవాల్‌ను కూడా టీడీపీ స్వీకరించాలి. పార్లమెంటరీ సంప్రదాయంలో ఇది ఉంటే దీనిపై రూలింగ్‌ ఇవ్వాలని పెద్దిరెడ్డి పట్టుపట్టారు.

Back to Top