ఉమ నీవు మంత్రివా? మానసిక రోగివా?

హైదరాబాద్ః టీడీపీ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. దేవినేని ఉమ మంత్రిలా మాట్లాడడం లేదని తొక్కుతా, నారతీస్తా అంటూ మానసిక రోగిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేనికి పిచ్చిపట్టినట్టుందని...ఆయనను ఆస్పత్రిలో చూపించాలని టీడీపీ నేతలకు హితబోధ చేశారు.  మీరు కార్లు, పొలాలు తగలబెట్టినా ప్రతిపక్ష నేత ప్రశ్నించకూడదా..? అని దేవినేనిని నిలదీశారు. గాలి, ధూళి మన్ను మశానం అన్నీ టీడీపీ పార్టీలోనే ఉన్నాయని నిప్పులు చెరిగారు.

Back to Top