అర్ధరాత్రులు సోదాలు చేయాల్సిన పనేంటి?

–అబద్ధాలు..మోసాలతో బాబు అధికారంలోకి వచ్చారు
 – సీఎం హోదాలో ఇచ్చిన ఒక్క  హామీలు కూడా నెరవేర్చలేదు
–  వైయస్‌ఆర్‌సీపీకి మద్దతిచ్చే వారిని టార్గెట్‌ చేస్తున్నారు
–  ఉప ఎన్నికలో ధర్మానికి, న్యాయానికి ఓటు వేయండి

నంద్యాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్న నేతల ఇళ్లపై అర్ధరాత్రులు సోదాలు చేయాల్సిన పనేంటని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్యవైశ్యులను టార్గెట్‌ చేస్తూ అర్ధరాత్రులు దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఫలాని చోట మాకు అనుమానం ఉందని చెప్పి ముందుగా వారెంట్‌ ఇచ్చి సోదాలు చేయాలని, అలా కాకుండా అర్ధరాత్రి ఒంటి గంట, 2 గంటల సమయంలో దాడులు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. అధికారం కోసం చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని, సీఎం హోదాలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదని విమర్శించారు. శనివారం నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
– అధికారం కోసం చంద్రబాబు మూడున్నరేళ్ల క్రితం ఎన్నో హామీలు ఇచ్చారని వైయస్‌ జగన్‌ విమర్శించారు. రైతులకు సంబంధించిన రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక రైతులను అతిదారుణంగా మోసం చేశారు. కేవలం సంవత్సరానికి రూ.3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి అదే రుణమాఫీ అంటున్నారు. అదివరకు రైతులకు అందుతున్న సున్నా వడ్డీ, పావలావడ్డీ రుణాలకు సంబంధించిన డబ్బులు కూడా బ్యాంకులకు జమా చేయకుండా ఎగురగొట్టారు. 
– పొదుపు సంఘాల మహిళలను కూడా చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి దగా చేశారు.
–  చదువుకున్న పిల్లలను కూడా వదలిపెట్టలేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రతి ఇంటికి రూ.2వేలు ఇస్తానన్నారు. 38 నెలలకు ప్రతి ఇంటికి రూ.76 వేలు బాకీ పడ్డారు.  
– ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం అన్నారు, ఇల్లు కట్టిస్తాన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసిన తీరు చూశాం. 
– మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడని మనందరికి తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన మోసాలను చూశాం. 
– కర్నూలు స్వాతంత్య్ర దినోత్సవం రోజు చేసిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు.  ముఖ్యమంత్రిగా మూడున్నరేళ్లలో ఒక్కటి కూడా చేయలేదు. 
– మూడున్నరేళ్లుగా రాష్ట్రంలోని వ్యాపారులపై చంద్రబాబు కమర్శియల్‌ ట్యాక్స్‌ అధికారులతో దాడులు చేయించి వేధిస్తున్నారు. అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ దాడులు చేయిస్తున్నారు. 
– వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తున్న ఆర్యవైశ్యులను టార్గెట్‌ చేస్తున్నారు.  
–నంద్యాల ఉప ఎన్నిక జరుగుతున్న వేళ ఎవరైనా రైడ్స్‌ చేసేటప్పుడు పోలీసులు వారెంట్లు చూపించి సోదాలు చేయాలి. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈ అర్ధరాత్రులు సోదాలు చేయాల్సిన పని ఏంటని అడుగుతున్నాను. 
– వైయస్‌ఆర్‌సీపీకి చెందిన రమేష్‌ మెడికల్‌ షాపులో దాడులు చేయించారు. మెడికల్‌ షాపు నడుపుతున్న దుకాణంలో రూ.3.50 లక్షలు దొరకడం గొప్ప సంగతా? అని ప్రశ్నించారు.
– వ్యాపారస్తుడు సత్యనారాయణ ఇంటిపై కూడా సోదాలు చేయించారు. ఆ ఇంట్లో దొరికింది రూ.5 వేలు మాత్రమే. 
– నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అర్ధరాత్రి దాటిని తరువాత ఏ వారెంటు లేకుండానే పోలీసులు ఇళ్లలోకి దూరి ఇష్టానుసారంగా సోదాలు చేస్తున్నారు. సత్యనారాయణ, సుబ్బారాయుడు, రమేష్, అమ్మతరాజు, ఆదిరెడ్డి, రామలింగారెడ్డి, దస్తగిరి ఇళ్లపై రైడ్స్‌ చేయించారు. ఏ ఇంట్లో రూ.20 వేలు కూడా ఉండకూడదా అని ప్రశ్నించారు.  
– నంద్యాలలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీకి మద్దతు తెలిపే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
–ఉప ఎన్నికలో ధర్మం వైపు నిలబడాలని, న్యాయానికి ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top