ప్రతిపక్ష నేతపై అనుచిత వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు దారుణంగా నిర్వహిస్తున్నారు. అసలు సమస్యను పక్కనపెట్టి ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అధికార పక్షం దూషణల పర్వానికి తెర లేపింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే చంద్రబాబుకు సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులపై చర్చకు వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే స్పీకర్‌ ఇవేవి పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించడంతో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. దీంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేసిన స్పీకర్‌ తిరిగి ప్రారంభం కాగానే మళ్లీ మంత్రులు, టీడీపీ సభ్యులకు మైక్‌ ఇచ్చి దూషణల పర్వానికి దిగారు. 


టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైయస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులు అగ్రిగోల్డుపై జరుగుతున్నను పక్కనపెట్టి ప్రతిపక్ష నేతపై విమర్శలు చేశారు. వైయస్‌ జగన్‌కు మైక్‌ ఇచ్చినట్లే ఇచ్చిన స్పీకర్‌ అర నిమిషంలోనే కట్‌ చేసి మళ్లీ మంత్రి అచ్చెన్నాయుడితో తిట్టించే కార్యక్రమం చేపట్టారు. దీంతో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు మరోమారు స్పీకర్‌ పోడియాన్ని ముట్టడించి నిరసన తెలపడంతో సభను మరోమారు వాయిదా వేశారు. 
Back to Top