పార్టీ పదవుల్లో నియామకాలు

హైదరాబాద్) వైఎస్సార్సీపీ
తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా కురసాల కన్న బాబుని నియమించారు. జిల్లా
పరిషత్ లో పార్టీ ఫ్లోర్ లీడర్ గా సాకే ప్రసన్న కుమార్ ను నియమించారు. ఈ మేరకు
పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘ కాలం
పాత్రికేయునిగా పనిచేసిన కన్న బాబుకి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు
ఉంది. 2009..14 మధ్య కాలంలో కాకినాడ రూరల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా
ప్రాతినిధ్యం వహించారు. జిల్లాలోని అనేకమంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 

Back to Top