పార్లమెంట్, నగర అధ్యక్షుల నియామకాలు

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పలు నియామకాలు జరిగాయి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రీజినల్‌ కోర్డినేటర్స్, పార్లమెంట్‌ జిల్లాల అధ్యక్షులు, నగర పార్టీ అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. 

రీజినల్‌ కోఆర్డినేటర్స్‌...
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు ధర్మాన ప్రసాదరావు, విశాఖపట్నం జిల్లాకు పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి, కృష్ణా, అనంతపురం జిల్లాలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుంటూరు జిల్లాకు బొత్స సత్యనారాయణ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పశ్చిమగోదావరి జిల్లాకు చలమలశెట్టి సునీల్, వైయస్‌ఆర్‌ కడప, ప్రకాశం జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు జిల్లాకు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిలను నియమించారు. 

పార్లమెంట్‌ జిల్లా పార్టీ అధ్యక్షులుగా...
శ్రీకాకుళం పార్లమెంట్‌కు తమ్మినేని సీతారాం, విజయనగరం పార్లమెంట్‌కు బెల్లాన చంద్రశేఖర్, విశాఖపట్నంకు తైనాల విజయ్‌కుమార్, అనకాపల్లి పార్లమెంట్‌కు గుడివాడ అమర్‌నాథ్, అరుకు పార్లమెంట్‌కు యస్‌. పరిక్షిత్‌రాజ్, కాకినాడ కురసాల కన్నబాబు, అమలాపురం పార్లమెంట్‌కు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, రాజమండ్రికి మోషేను రాజు, నరసాపురం ముదునూరు ప్రసాదరాజు, ఏలూరుకు ఎమ్మెల్సీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), మచిలీపట్నం కొలుసు పార్థసారధి, విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి సామినేని ఉదయభాను, గుంటూరు పార్లమెంట్‌కు రావి వెంకట రమణ, నరసరావుపేట పార్లమెంట్‌ స్థానానికి అంబటి రాంబాబు, బాపట్ల పార్లమెంట్‌కు మోపిదేవి వెంకటరమణ, ఒంగోలు పార్లమెంట్‌కు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, నంద్యాల పార్లమెంట్‌కు శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు పార్లమెంట్‌కు బీవై రామయ్య, అనంతపురం పార్లమెంట్‌కు అనంత వెంకటరామిరెడ్డి, హిందూపురం పార్లమెంట్‌కు శంకర్‌నారాయణ, కడప పార్లమెంట్‌కు మేయర్‌ సురేష్‌బాబు, నెల్లూరు పార్లమెంట్‌కు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్‌కు కిలివేటి సంజీవయ్య, రాజంపేట పార్లమెంట్‌కు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్‌ అధ్యక్షుడిగా జంగాలపల్లి శ్రీనివాసులును నియమించారు. 

నగర పార్టీ అధ్యక్షులుగా...
శ్రీకాకుళం నగర వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా సాదో వైకుంఠరావును, అదే విధంగా నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆనందవరపు సూరిబాబులను నియమించారు. విజయనగరం ఆసపు వేణు, విశాఖపట్నం మళ్లా విజయప్రసాద్, కాకినాడ కంపర రమేష్, రాజమండ్రి కందుల దుర్గేష్, ఏలూరు బద్దాని శ్రీనివాస్, మచిలీపట్నం షేక్‌ సలార్‌ దాదా, విజయవాడ నగర అధ్యక్షుడిగా వెల్లంపల్లి శ్రీనివాస్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మల్లాది విష్ణు, గుంటూరు నగర అధ్యక్షుడిగా లేళ్ల అప్పిరెడ్డి, ఒంగోలు వెంకట్‌రావు, నెల్లూరు టి. వెంకటేశ్వరరావు, తిరుపతి పాలగిరి ప్రతాప్‌రెడ్డి, చిత్తూరు ఆర్‌. చంద్రశేఖర్, కడప పులి సునీల్‌కుమార్, కర్నూలు విష్ణువర్ధన్‌రెడ్డి, అనంతపురం సోమశేఖర్‌రెడ్డిలను నియమించారు. 
Back to Top