రెగ్యులర్‌ తహశీల్దార్‌ను నియమించాలి

కలకడ : రెగ్యులర్‌ తహశీల్దార్‌ను నియమించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్‌ బాబురెడ్డి డిమాండ్‌ చేశారు. మూడు నెలలుగా తహశీల్దార్‌ లేకపోవడంతో ఇన్‌చార్జ్‌ పాలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కలకడ రెవిన్యూ కార్యాలయంలో తహాసీల్దార్‌ నారాయణమ్మను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన అనంతరం కలిరికి తహాసీల్దార్‌ నటరాజ్‌ పూర్తి ఇన్‌చార్జ్‌ బాద్యతులు అప్పగించారు. అయితే అన్ని రెవిన్యూ కార్యాక్రమాలు కలికిరికే పరిమితమ మయ్యాయని కలకడ తహాసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది కూడ ఉండటం లేదని విధ్యార్థులు , వృద్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కార్యాలయానికి హాజరైన అనేక మందికి ఖాళీ కుర్చీలే ధర్శనమిచ్చాయి. రెవిన్యూ సమస్యలు పరిష్కరించడంలో జాప్యంతోపాటు, తహాసీల్దార్‌ అందుబాటులో లేరనే నెపంతో చెరువులు, కుంటల ఆక్రమణలు, చెట్లు నరకడం అధికమయ్యాయని గుర్తు చేశారు. ఇలాగే ఉంటే తీవ్ర ఆందోళనలు తప్పవని, అనేక మందిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు. నిత్యం అందుబాటులో ఉండే ఎంపీడీవో ధనలక్ష్మిని సైతం వాల్మీకిపురం మండలం అదనపు బాద్యతలు ఇచ్చారని, దీంతో కలకడ మండలంలో మండలస్థాయి అధికారులు లేకుండ ఉన్నతాదికారులు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇకనైనా జిల్లా ఉన్నతాదికారులు తక్షణ చర్యలు తీసుకుని అధికారులను, సిబ్బంది, పూర్తి స్థాయిలో నియమించకుంటే సిబ్బందికోసం ధర్నాలు చేయాల్సి ఉంటుందని బాబురెడ్డి హెచ్చరించారు.

Back to Top