ఏపీఐఐసీ మాజీ చైర్మ‌న్ శివ‌సుబ్ర‌మ‌ణ్యం వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

నంద్యాల‌:   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఏపీఐఐసీ మాజీ చైర్మ‌న్ శివ‌సుబ్ర‌మ‌ణ్యం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నంద్యాల‌లో ఆయ‌న శ‌నివారం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా 300 మంది అనుచరుల‌తో ఆయ‌న పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శివ‌సుబ్ర‌మ‌ణ్యంకు వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ కండువా వేసి సాద‌రంగా ఆహ్వానించారు. 
వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స‌న్మానం
నంద్యాల‌: న‌ంద్యాల ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన ఆర్య‌వైశ్యుల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఘ‌నంగా స‌న్మానించారు. ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్ ఆర్య‌వైశ్యుల‌కు ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో ఆయ‌న‌కు స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ కు ఆర్య‌వైశ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆర్య‌వైశ్యుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

సంజీవ‌న‌గ‌ర్ నుంచి ప్ర‌చారం ప్రారంభం
 నంద్యాల నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం 11వ రోజుకు చేరుకుంది. శ‌నివారం ప‌ట్ట‌ణంలోని సంజీవనగర్‌ నుంచి వైయ‌స్‌ జగన్ రోడ్‌ షో ప్రారంభం కానుంది.
Back to Top