సింగ‌పూర్ లో అధికారుల‌కు శిక్ష‌ణ‌

ప్ర‌భుత్వ అధికారుల‌కు సింగ‌పూర్ కంపెనీల కోచింగ్‌
ప్రైవేటు శిక్ష‌ణ కోసం స‌ర్కారీ ఉద్యోగులు
ఖ‌ర్చంతా ప్ర‌భుత్వానిదే..!

హైద‌రాబాద్‌: రాజ‌ధాని ని పూర్తిగా సింగ‌పూర్ గుప్పెట్లో పెట్టేయాల‌ని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యించుకొన్నారు. ఇందుకు త‌గిన‌ట్లుగా ప్రతీ అంశంలోనూ సింగ‌పూర్ నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నారు. 

రాజ‌ధాని అధికారుల‌కు పాఠాలు
రాజ‌ధాని ప్రాంతంలో వ్య‌వ‌హారాల్ని ప‌ర్య‌వేక్షించే సాధికార విభాగం- క్రీడా కు చెందిన 25 మంది అధికారుల్ని సింగ‌పూర్ కు పంపిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి కోచింగ్ ఇప్పిస్తున్నారు. కొత్త రాజ‌ధానిలో భూ వినియోగం, ర‌వాణా వ్య‌వ‌స్థ‌, మౌళిక వ‌స‌తుల అబివృద్ది, ప్రైవేటు, ప‌బ్లిక్ సామాజిక రంగాల నిర్మాణం, గ్రీన‌రీ, పారిశ్రామిక‌, ఆర్థిక పురోగ‌తి వంటి అంశాల మీద శిక్ష ణ ఇవ్వ‌నున్నారు. ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ లీడ‌ర్స్ ఇన్ అర్బ‌న్ గ‌వ‌ర్నెన్స్ ప్రోగ్రామ్ పేరుతో ఈ శిక్ష‌ణ ఉండ‌బోతోంది. 

సింగ‌పూర్ లో ప్రైవేటు కోచింగ్‌
ఇప్ప‌టికే స‌ర్వం సింగ‌పూర్ కు అప్ప‌గించ‌టంపై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ కోచింగ్ మీద కూడా అనుమానాలు క‌లుగుతున్నాయి. మొత్తం వ్య‌వ‌హారాల‌న్నీ సింగ‌పూర్ కంపెనీల‌కు అనుకూలంగా మార్చేందు కోస‌మే ఈ శిక్ష‌ణ ఏర్పాటు చేశార‌న్న మాట వినిపిస్తోంది. అందుకోసమే సింగ‌పూర్ కంపెనీల తో కోచింగ్ ఏర్పాటు చేశార‌ని చెబుతున్నారు. దీనికి అయ్యే మొత్తం ఖ‌ర్చు రూ. 4 ల‌క్ష‌లు కూడా ప్ర‌భుత్వ‌మే భ‌రించ నుంది.  

 
Back to Top