అవినీతిలో ఏపీని నం.1 చేసిన ఘనత బాబుదే

విశాఖపట్నంః  టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఆయన తనయుడు,  మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎంపీలు నిలువునా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇసుకమాఫియా, మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలా ప్రతిదాంట్లోనూ దోపిడీకి పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేసిన అవినీతి కార్యక్రమాన్ని ఢిల్లీవ్యాప్తంగా  తమ అధ్యక్షులు వైఎస్ జగన్ ఎండగట్టారన్నారు. 

విశాఖపట్నంలో జరిగే ప్రతి కుంభకోణం వెనుక లోకేష్ ఉన్నాడని ప్రసాద్ రెడ్డి అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలంటూ లోకేష్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అలా మాట్లాడే అర్హత, స్థాయి లోకేష్ కు లేదన్నారు. చంద్రబాబు లాంటి దగుల్బాజి ఎవరూ లేరని పిల్లనిచ్చిన మామ ఎన్టీఆరే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  బెల్ట్ షాపులు మూసేస్తానని చెప్పిన చంద్రబాబు...విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెంచేసి మద్యం ఏరులై పారిస్తున్నారని విమర్శించారు.  బాబు హయాంలో కరువు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని ప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలా అన్ని విధాలా చంద్రబాబు ఏపీని దేశంలోనే అవినీతిలో నంబర్ వన్ చేశాడని దుయ్యబట్టారు.

Back to Top