మహిళలపై దాడుల్లో ఏపీ నంబర్ వన్

  • బాబు  హ‌యంలో మ‌హిళలకు రక్షణ కరువు
  • ఎస్సీ వెల్ఫేర్ బాలిక‌ల హాస్ట‌ల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు
  • విద్యార్థినిలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రోజా
తిరుప‌తిః అర్థ‌రాత్రి ఆడ‌వాళ్లు న‌డిచిన‌ప్పుడు మ‌న‌కు స్వాతంత్రం వ‌చ్చిన‌ట్లు అని గాంధీ చెబితే... చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్రంలో ప‌గ‌టి పూట కూడా మ‌హిళ రోడ్డుమీద న‌డ‌వ‌లేక‌పోతోంద‌ని.. ఇందుకు ప్ర‌భుత్వం సిగ్గుప‌డాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా అధ్య‌క్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా స్ప‌ష్టం చేశారు.  అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం వేడుక‌ను చిత్తూరు జిల్లా తిరుప‌తి ఎస్సీ వెల్ఫేర్ బాలిక‌ల హాస్ట‌ల్‌లో ఎమ్మెల్యే రోజా ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేక్‌క‌ట్ చేసి అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అదే విధంగా హాస్టల్‌లో విద్యార్థినిల‌తో క‌లిసి రోజా భోజ‌నం చేశారు. 

అనంత‌రం ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... పేద విద్యార్థినిలలో స్ఫూర్తి నింప‌డానికి హాస్ట‌ల్‌కు రావ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. క‌ష్టాలు త‌ట్టుకోలేక మ‌ధ్య‌లోనే బాలిక‌లు చ‌దువులు ఆపేస్తున్నార‌ని,  క‌ష్టాలు ఎదుర్కొన్న‌ప్పుడే మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని బాలిక‌ల‌కు సూచించారు. దేశంలో మ‌హిళ‌ల‌పై దాడులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌ఠిన‌మైన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ వాటి అమ‌లు తీరులో లోపాలున్నాయ‌ని విమ‌ర్శించారు. బాల్య వివాహాల‌లో, మందు విక్ర‌యాల్లో, మహిళ‌ల‌పై దాడుల్లో ఆంధ్ర‌రాష్ట్రం నెంబ‌ర్ స్థానాన్ని అధిరోహించింద‌న్నారు. చ‌ట్టాల‌ను కాపాడాల్సిన పోలీసులు పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కు కొమ్ముకాస్తున్నార‌ని ఆరోపించారు. 

 చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని రోజా మండిప‌డ్డారు. మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకుంటూ వారిపై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌న్నారు. చ‌దువుల త‌ల్లి రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌కు బాధ్యులైన వారిని శిక్షించ‌కుండా ప్ర‌భుత్వం కొమ్ముకాస్తోంద‌ని ఆరోపించారు. ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడిచేసిన చింత‌మ‌నేనిపై చ‌ర్య‌లు తీసుకోకుండా ద‌గ్గ‌రుండి బాబు సెటిల్‌మెంట్లు చేస్తున్నార‌న్నారు. ఇంట్లో ఉన్న భార్య‌ను, కోడ‌లును గౌర‌వించ‌డం కాదు... బ‌య‌టున్న మ‌హిళ‌ల‌ను కూడా గౌర‌వించాల‌ని చంద్ర‌బాబుకు చుర‌కంటించారు. 
Back to Top