చంద్రబాబుపై మహిళాలోకం కన్నెర్ర

ఏపీః చంద్రబాబుపై రాష్ట్ర మహిళలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బాబు  తన స్వార్థం కోసం నికృష్టంగా నీతి మాలిన రాజకీయాలు చేస్తూ..మహిళలను బలిపశువులను చేస్తున్నారని మండిపడుతున్నారు. కల్తీ మద్యంతో భర్తలు చనిపోయి రోదిస్తున్న భార్యల మనోవేధన చూస్తే గుండెతరుక్కుపోతుందని సాటి మహిళలు ఆవేదన చెందారు. చంద్రబాబు మహిళలపై నీకు ఇంత కసి ఎందుకు అని నిలదీస్తున్నారు. 

మీ సంచులు నింపుకోవడం కోసం బీదవాళ్లు కడుపులు ఎందుకు కొడుతున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు తమ ఖజానా నింపుకోవడం కోసమే అనధికారికంగా బార్లు నడుపుతున్నారని  నారీమణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల మంగళ సూత్రాలతో చెలగాటమాడితే తరిమికొడతామని హెచ్చరించారు. తక్షణమే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Back to Top