ఏపీని నట్టేట్లో ముంచారు

గుంటూరుః కేంద్రం, చంద్రబాబు ఇద్దరూ కలిసి ఏపీ ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏపీని నట్టేట్లో ముంచుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు వదిలేసి బాబు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలపై చంద్రబాబు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. హామీలన్నీ అమలు చేశామని కేంద్రం చెబుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Back to Top