ప్రజల పక్షాన పోరాడితే కేసులా..?

విశాఖపట్నం: గిరిజనులు, ఆదివాసీల మనోభావాలను తెలియజేసిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ  విశాఖ జిల్లా అద్యక్షడు గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కేసులు పెట్టాలి కాని, ప్రజల తరపున మాట్లాడితే కేసులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు హత్యాయత్నంతో సహా 5 కేసులను గిడ్డి ఈశ్వరి పై అన్యాయంగా బనాయించారని ఆయన విమర్శించారు. రాజ్యాంగం, న్యాయస్థాలు ఉన్నాయని, న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని అమర్ నాథ్ తెలిపారు.

Back to Top