పేరు ఒక‌రిది.. ప్ర‌చారం మ‌రొక‌రిది..!

ప్ర‌చారం కోసం చంద్ర‌బాబు గిమ్మిక్కులు
కృష్ణాగోదావ‌రి నదుల అనుసంధానం జ‌రిగిందంటూ ప్ర‌చారం
ప‌థ‌కాల్ని అమ‌లు చేసిన వారిని మ‌రిచిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్: కృష్ణా గోదావ‌రి న‌దుల అనుసంధానం మీద ప్ర‌భుత్వం దొంగాట ఆడుతోంది. నీటిని ప‌క్క మార్గాల్లో ఖ్యాతి కొట్టేసేందుకు హడావుడి ప‌డుతోంది.

నిర్మాణ ప్ర‌దాత‌ను మ‌రిచిపోతున్నారా..!
ఇప్పుడు గోదావ‌రి నుంచి నీటిని తాడిపూడి జ‌లాశ‌యం నుంచి తోడుతున్నారు. అక్క‌డ నుంచి నీటిని పంపించి పోల‌వ‌రం కుడి కాల్వ‌లోకి మ‌ళ్లిస్తున్నారు. వాస్త‌వానికి ఈ తాడిపూడి ఎత్తిపోత‌ల కు నిధులు కేటాయించి, సాకారం చేసిన‌ది దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ఈ ప‌థ‌కం ద్వారా వేలాది ఎక‌రాల‌కు ఆయ‌న మొద‌టి ద‌శ‌లోనే సాగునీటిని అందించారు. కానీ త‌ర్వాత కాలంలో దీని విస్త‌ర‌ణ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ నీటిని దొంగ మార్గంలో మ‌ళ్లించేస్తున్నారు. అటు పోల‌వ‌రం కుడి కాల్వ నిర్మాణం పనులు కూడా చాలా వ‌ర‌కు వైఎస్సార్ చ‌ల‌వే అని చెప్పుకోవాలి.

అనుసంధానం అంటూ ప్రచారం
క‌ళ్ల ముందు వాస్త‌వాలు ఇంత స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా కానీ వ‌ర‌ద నీటిని మ‌ళ్లించి ఇదంతా చంద్ర‌బాబు చ‌ల‌వ అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ప‌ట్టిసీమ నుంచి ఇప్ప‌టిదాకా ఒక్క చుక్క కూడా నీరు విడుద‌ల కాలేదు. కానీ అంతా అయిపోయిన‌ట్లుగా చెప్పుకొంటున్నారు. చేయ‌ని ప‌నుల్ని కూడా సాధించిన‌ట్లుగా డ‌బ్బా కొట్టుకొంటున్న ఈ పాల‌కుల్ని ఏమనాలి..!
Back to Top