బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం

భాకరాపేట : ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అన్యాయం జరిగిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యుగంధర్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ సేవాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి సహదేవరెడ్డితో కలిసి ఆయన బుధవారం చిన్నగొట్టిగల్లు మండల పరిషత్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్‌లో అరకొర నిధులను కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం నిధులు రాబట్టటంలో విఫలమయిందని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటులో బీజేపీతో కలసి టీడీపీ కూడా మోసం చేసిందన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ అలుపెరగకుండా  పోరాడుతున్నారని చెప్పారు. ఇప్పటికే రవాణా రంగంలో తీసుకొచ్చిన అనేక మార్పులతో  ఈ రంగం కుదేలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాల కారణంగా లక్షలాది కుటుంబాలకు ఉపాధి కరువు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజక వర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Back to Top