హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని మూసేస్తున్నారు

పాడి రైతులను ఆదుకోవాలి
ఏపీ డైరీకి రూ.100 కోట్లు కేటాయించాలి
రైతుల పోరాటానికి వైయస్సార్సీపీ మద్దతుః విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ః చంద్రబాబు తన హెరిటేజ్ ను అభివృద్ధి చేసుకోవడం కోసం ఏపీ డెయిరీని నాశనం చేస్తున్నారని వైయస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు.  వెంటనే ఏపీ డెయిరీకి రూ.100 కోట్లు కేటాయించి పాడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒకే నెలలో మూడు సార్లు పాల సేకరణ ధర తగ్గించడం దారుణమన్నారు. పాడి పరిశ్రమను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పని చేయొద్దని విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. 

బాబు తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం, ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టుకోవడం కోసం  పాల రైతులను దోపిడీ చేస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గోమూత్రంపై కూడా వ్యాట్ విధించే ఆలోచన చేయడం దుర్మార్గమన్నారు. టీడీపీ సర్కార్ రైతుల గురించి ఆలోచనే చేయడం లేదని విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి వైయస్సార్సీపీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే రైతుల ఆందోళనలను గుర్తించి, వారిని ఆదుకోవాలని సూచించారు. 
Back to Top