ఆసరా లేని దసరా..!

సొమ్ము ఒకరిది..సోకు చంద్రబాబుది..!
ప్రజలకు పచ్చడిమెతుకులు..చంద్రబాబుకు చక్కెరపొంగలి..!

ప్రజలకు
దసరా పండగ ఆసరా లేకుండా పోయింది. అమరావతిని చుక్కల్లో చూపిస్తున్న
మాదిరి... చంద్రబాబు సామాన్య ప్రజానీకానికి ధరల సెగల పొగచూపుతున్నాడు.
చంద్రబాబేమో చక్కెరపొంగలి తింటూ ప్రజలను పచ్చడి మెతుకులకు నోచుకునేలా
చేస్తున్నాడు. అమరావతి శంకుస్థాపన పేరుతో అట్టహాసంగా దసరా పండగను
చేసుకుంటున్న చంద్రబాబు..ప్రజలను మాత్రం పస్తులుంచుతున్నాడు. మార్కెట్లో
మండుతున్నపప్పు ధరలతో ప్రజలు పండగకి దూరమైన పరిస్థితి ఏర్పడింది. ఐనా అవేమీ
పట్టకుండా ఎంతసేపు రాజధాని సోకుల్లో మునిగితేలుతున్నారు. 

చక్కెరపొంగలి..పచ్చడి మెతుకులు..!
ప్రజలను
దోచి పరాయి వాడికి పెట్టడమంటే ఇదే కాబోలు. ఎక్కడినుంచో వచ్చే వారికోసం
రకరకాల వంటకాలతో రుచిచూపించేందుకు ఆరాటపడుతున్న చంద్రబాబు...రాష్ట్ర ప్రజల
నోట్లోకి ముద్ద కూడా వెళ్లకుండా చేస్తున్నాడు. వందలాది కోట్ల ప్రజాధనాన్ని
దుబారా చేస్తూ ఒక్కో భోజనానికి వేల రూపాయలు ఖర్చు చేస్తున్న బాబు
...ప్రజలకు పప్పు, బెల్లం కూడా అందించలేని దుర్మార్గమైన పాలన
సాగిస్తున్నాడని పలువురు నేతలు మండిపడుతున్నారు. 

చంద్రబాబు ఘనత..!
మార్కెట్లో
కందికప్పు కొండెక్కింది. కిలోరూ. 200 నుంచి 210 పలుకుతోంది. మినపప్పు
రూ.170 పైనే ఉంది. ధరలు మంటెత్తిస్తున్నా  పట్టించుకోకుండా...రాజదాని
మోజులో దసరా హంగామా చేస్తూ పచ్చచొక్కాలు జనాన్ని పర్వదినానికి దూరం
చేస్తున్నారు.  సరుకులు ఇవ్వరు...పేలిపోతున్న ధరలను అదుపు చేయరు. పండగ పూట
పలహారాలు తినాల్సిన జనాన్ని పచ్చడి తినేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని అంతా
కీర్తిస్తున్నారు.  
Back to Top