రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బంద్ పిలుపు మేరకు ప్రజలు, పార్టీ శ్రేణులు కదం తొక్కారు. అన్ని జిల్లాల్లో ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ పాటిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఐతే, శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం దౌర్జన్యానికి దిగింది. వైసీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పలు చోట్ల లాఠీఛార్జ్ లు, బెదిరింపులతో భీతావహ వాతావరణం సృష్టించారు. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్ లకు తరలించారు.
ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ అరెస్ట్రామచంద్రాపురం:ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు మేరకు..తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వేకువజాము నుంచే వైసీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. స్థానిక బస్ డిపో వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న సుభాష్ చంద్రబోస్ సహా వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హిందూపురంలో వైసీపీ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్ అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ నేతలపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పట్టణంలోని సద్బావన సర్కిల్ లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న పార్ట శ్రేణులపై పోలీసులు కావరం ప్రదర్శించారు. లాఠీఛార్జ్ చేసి నాయకులను చెల్లాచెదురు చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త వినయ్ తో పాటు పది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ కాసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన నాయకులు హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. విజయ్,దాదులు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ బంద్ తో గుంతకల్లు పట్టణంలో జనజీవనం స్తంభించింది. 200 పెట్రోల్, డీజిల్ రవాణా ట్యాంకర్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
విశాఖలో విజయసాయిరెడ్డి అరెస్ట్విశాఖలో వైఎస్సార్సీపీ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రజలు, పార్టీశ్రేణులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అనే నినాదంతో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈసందర్భంగా జగదాంబ సెంటర్ లో ధర్నాకు దిగిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరెడ్డి సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతిలో వైసీపీ బంద్..నేతల అరెస్ట్ చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పార్టీనేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతబడ్డాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు ముూసివేశారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. పట్టణంలో బంద్ నిర్వహిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ సమీపంలో ధర్నా చేస్తున్న నాయకులను ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు.