మూడో రోజు అట్టుడుకిన అసెంబ్లీ

రిషితేశ్వరిది ఆత్మహత్య కాదు సర్కార్ హత్య...వైఎస్సార్సీపీ 
బాధ్యులపై చర్యలెందుకు తీసుకోలేదు చంద్రబాబు....!

యూనివర్సిటీ కులగజ్జితో కుళ్లిపోయింది..!
మూజో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా మారాయి.  రిషితేశ్వరి ఆత్మహత్యపై  సభ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో రిషితేశ్వరి సూసైడ్ పై చర్చ వాడీవేడీగా సాగింది. ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు.  రిషితేశ్వరిది ఆత్మహత్య కాదని సర్కారీ హత్యని ఎమ్మెల్యేలు రోజా, ఉప్పులేటి కల్పన ఫైరయ్యారు. నాగార్జున యూనివర్సిటీ కులగజ్జితో కుళ్లిపోయిందని ఆరోపించారు. రిషితేశ్వరి సూసైడ్ కు కారణమైన ప్రిన్సిపల్ బాబూరావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు.  బాబురావును ప్రాసిక్యూషన్ చేయాలని బాలసుబ్రమణ్యం కమిటీ చెప్పినా పట్టించుకోలేదని, ముగ్గురుని సస్పెండ్ చేసి సర్కార్ చేతులు దులుపుకుందని  మండిపడ్డారు. 

ప్రభుత్వం అరాచకాలతోనే మహిళలపై దాడులు..!
టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలపై దాడులు పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం అరాచాకాలకు నారాయణ కాలేజీలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.  రిషితేశ్వరి చనిపోయిన నాలుగురోజులకు హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి....ఆతర్వాత మంత్రి శ్రీమంతుడి ఆడియో ఫంక్షన్ కు వెళ్లారని  రోజా విమర్శంచారు. అదే చిత్తశుద్ధి ర్యాగింగ్ ను అరికట్టడంలో  చూపి ఉంటే విద్యార్థుల ప్రాణాలు పోయేవి  కాదన్నారు.  రిషితేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించకుండా హోటల్ కు పిలుపించుకున్న మంత్రుల సంస్కారం ఏపాటిదో అర్థమవుతుందని రోజా ధ్వజమెత్తారు.  

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం..!
రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు స్పందించలేదని వైెఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిలదీశారు.  యాంటీ ర్యాగింగ్ పై బాబు తాను తెచ్చిన చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.  నాగార్జున  యూనివర్సిటీలో లైంగిక వైధింపులు, అసాంఘిక కార్యాలక్రమాలు జరుగుతున్నాయంటే దాని వెనక మంత్రుల ప్రమేయమే కారణం.
Back to Top