ఏడుసార్లు మైక్ కట్..సోమవారానికి సభ వాయిదా

ఏపీ అసెంబ్లీ: గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్రసంగానికి అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టించారు. గ‌తంలో హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మాదిరిగానే కొత్త అసెంబ్లీలో కూడా అధికార పార్టీ అదే వ‌ర‌వ‌డి కొన‌సాగించింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగానికి మొద‌ట 55 నిమిషాల స‌మ‌యం ఇచ్చిన స్పీక‌ర్ మ‌ధ్య మ‌ధ్య‌లో ఏడు సార్లు మైక్ క‌ట్ చేశారు. మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, దేవినేని ఉమా, పల్లె రఘునాథరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులు మధ్యలో లేచి పదేపదే వైయస్ జగన్ పై ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకుండా స్పీకర్ మాటిమాటికి మంత్రులకు అవకాశం కల్పించారు.  దీంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు స్పీక‌ర్ పోడియం వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్ట‌ారు.  చివ‌ర‌కు ఐదు నిమిషాల గ‌డ‌వుతో వైయ‌స్ జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లే ఇచ్చి ఆయ‌న మాట్లాడుతుండ‌గానే స్పీక‌ర్ స‌భ‌ను ఏకంగా ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు వాయిదా వేశారు. నిరసనగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు.

Back to Top