నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తొలిసారిగా తాత్కాలిక అసెంబ్లీలో శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పక్కనే నిర్మించిన తాత్కాలిక శాసనసభా ప్రాంగణంలో సోమవారం తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి.


ప్రభుత్వం విస్మరించిన హామీలనే అస్త్రాలుగా మలుచుకుని ప్రతిపక్ష వైయస్సార్‌సీపీ శాసనసభా సమావేశాల్లో నిలదీయనుంది. రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను ప్యాకేజీల కోసం, ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని పక్కన పడేసిన అంశంపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా ప్రశ్నించనుంది. రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇలా అంశాల వారీగా ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. ప్రతిపక్షంపై ఎదురుదాడికి పాలకపక్షం సమాయత్తమైంది. 13న సభలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టాక, 28 వరకు అసెంబ్లీ కొనసాగించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
Back to Top