నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మధ్యాహ్నం నుంచి ఏపీ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో బడ్జట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలన, అవినీతి-అక్రమాలపై వైఎస్సార్సీపీ అసెంబ్లీ వేదికగా టీడీపీ సర్కార్ ను నిలదీయనుంది. ప్రజల పక్షాన ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపనుంది.  అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం...తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చర్చను పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తోంది. ప్రభుత్వ కుయుక్తులను తిప్పికొట్టేందుకు వైఎస్సార్సీపీ సన్నద్ధమైంది.

Back to Top