అనుపాలెంలో మహానేత విగ్రహావిష్కరణ

రాజుపాలెం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల తలపెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అనుపాలెం చేరుకున్నప్పుడు ఆమె ఘన స్వాగతం లభించింది. అనుపాలెంలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తదితరులు ఆమె వెంట ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి పూనూరి గౌతమ్‌రెడ్డి, తలశిల రఘురాం, నాగార్జున, మాజీ సర్పంచి అన్నపురెడ్డి పద్మావతి, బండి నాగార్జునరెడ్డి, సురసాని వెంగళరెడ్డి, అన్నపురెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, యక్కంటి హనిమిరెడ్డి, గంగిరెడ్డి శివశంకర్‌రెడ్డి, పెద్ద ఎత్తున్న అభిమానులు పాల్గొన్నారు.

Back to Top