'ఆ కమిటీతో ప్రయోజనం శూన్యం'

ఎర్రగుంట్ల 12 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి స్పష్టంచేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ విభజనకు పూనుకుంటోందని ఆయన ఆరోపంచారు. కేవలం 10 ఎంపీ సీట్ల కోసం రాష్ట్రాన్ని చీల్చారని ఆయన మండిపడ్డారు.  సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంతో ఆంటోనీ సారథ్యంలో కాంగ్రెస్ ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీతో ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. వైయస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల నీటి కేటాయింపుల సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. ద్విగిజయ్ సింగ్ నోటికొచ్చిన విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు.  సోనియా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిందన్నారు. తమిళనాడుకి చెందిన కేంద్ర మంత్రి చిదంబరం మన రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆయన ఆరోపించారు.

తాజా వీడియోలు

Back to Top