టీడీపీ ప్రభుత్వంపై తీవ్రమౌవుతున్న ప్రజా వ్యతిరేకత

విశాఖః రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెల్లి ఉబుకుతున్నదని వైయస్‌ఆర్‌సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. టీడీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు.జననేత వైయస్‌ జగన్‌కు వస్తున్న అపూర్వ ఆదరణతో ప్రజలను పక్కదారి పట్టించడానికి, టిడిపి ధర్మపోరాట దీక్షలంటూ దొంగదీక్షలు చేస్తున్నదని విమర్శించారు.యస్‌ జగన్‌ సమర్థవంతమైన నాయకుడని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఏం సాధించారని ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చుకుని సొంతడబ్బా కొట్టుకుంటుంన్నారన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు, ఉపాధి లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. 
Back to Top