రైతు వ్యతిరేక ప్రభుత్వం

హైదరాబాద్ః 'టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అనేక మంత్రిమండలి సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం రైతుల పరిస్థితిపై ఒక్కసారి కూడా చర్చించకపోవడం దారుణమన్నారు. రైతులకు భరోసా కల్పించే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో రైతులు ఇంట్లో బంగారం తాకట్టుపెట్టి మరీ పంటలు వేసుకున్నారని...వర్షాభావంతో పూర్తిగా నష్టపోయారని చెప్పారు. రైతుల పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే రెయిన్ గన్ లతో కరువును జయించానని చంద్రబాబు చెప్పుకోవడం బాధాకరమన్నారు.

తాజా ఫోటోలు

Back to Top