అంతా మీరే చేశారు..!

పుష్క‌రాల తొక్కిస‌లాట‌కు పూర్తి కార‌ణం చంద్ర‌బాబే
అన్న సంగ‌తి క్ర‌మంగా రూఢి అవుతోంది.
చంద్ర‌బాబు కి జాతీయ
స్థాయిలో ప్ర‌తిష్ట‌ను
తెచ్చిపెట్టేందుకు నేష‌న‌ల్
జాగ్ర‌ఫీ చానెల్ తో
ఒప్పందం కుదుర్చుకొన్నారు. రూ. 60 ల‌క్ష‌ల‌కు కాంట్రాక్టు కుదుర్చుకొన్న‌ట్లు స్వ‌యంగా
ప్ర‌భుత్వం మీడియా స‌ల‌హాదారు
ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ నిర్ధారించారు.
ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీక‌ర‌ణ కోసం
ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు బోయ‌పాటి
శ్రీ‌ను కి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇందులో బాగా క‌నిపించేందుకు
భ‌క్తుల్ని 2-3 గంట‌ల పాటు
నిలిపివేసి, ఒకేసారి గేటునుంచి వ‌దిలిన‌ట్లు
నిర్ధార‌ణ అయ్యింది. దీంతో
తొక్కిస‌లాట జ‌రిగి
దాదాపు 30మంది దాకా ప్రాణాలు
కోల్పోయారు.

ఇదంతా
ఒక ఎత్త‌యితే, చంద్ర‌బాబు ఇంకా ఘాట్
లో ఉండ‌గానే తొక్కిస‌లాట మొద‌లైంద‌న్న వార్త ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఈ విష‌యాన్ని
ప‌సిగ‌ట్టిన ఒక
పోలీసు ఉన్న‌తాధికారి ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లిన‌ట్లు వెల్ల‌డైంది.
మొద‌ట‌గా న‌లుగురు, ఆ త‌ర‌వాత 11 మంది తొక్కిస‌లాట
లో ప్రాణాలు కోల్పోయార‌ని చంద్ర‌బాబు
కి చెప్పిన‌ట్లు ఒక పోలీసు
అధికారి వివ‌ర‌ణ‌.
దీని ప్ర‌కారం చూస్తూ
చంద్ర‌బాబు తొక్కిస‌లాట
అయ్యేంత వ‌ర‌కు
అక్కడే ఉండి నెమ్మ‌దిగా
జారుకొన్నార‌ని తెలుస్తోంది.

మొత్తం
చేయాల్సింది అంతా చంద్ర‌బాబే
చేసి, ఇప్పుడు మాత్రం నెపాన్ని వేరే వారి మీద‌కు మ‌ళ్లించేందుకు
ప్ర‌య‌త్నిస్తున్నారు. న్యాయ
విచార‌ణ జ‌రిపిస్తామ‌ని, బాద్యుల‌పై
చ‌ర్య తీసుకొంటామ‌న
చెబుతున్నారు. అంటే చంద్ర‌బాబు
నాట‌కానికి స‌హ‌క‌రిస్తే స‌రే స‌రి, లేదంటే బాధ్యులు
అన్న నెపంతో వేటు వేస్తార‌న్న
మాట‌...!

Back to Top