స్పీక‌ర్ ఎదుట మరో పిటీష‌న్

హైదరాబాద్: అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఎదుట అన‌ర్హ‌త‌కు సంబంధించి మ‌రో పిటీష‌న్ దాఖ‌లు అయింది. 
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, దేశాయ్ తిప్పారెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు నిరోధక చట్టం క్రింద తక్షణమే అయన పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేర‌కు పిటీష‌న్ త‌యారు చేసి, విధి విధానాల ప్ర‌కారం అసెంబ్లీ కార్యాల‌యానికి త‌ర‌లి వెళ్లారు.  స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో.. అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు ప‌త్రం అందించారు. 
Back to Top