అన్న వస్తున్నాడు...నవరత్నాలు తెస్తున్నాడు

–ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే
–వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
–నంద్యాలలో లాగా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ
–రాయచోటి నవరత్నాల సభలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి
–నాది వైయస్‌ ఇజం... వైయస్‌ఆర్‌ కుటుంబం కోసమే నా జీవితం అంకితం
– ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

రాయచోటి రూరల్‌ : మూడున్నర ఏళ్ల టీడీపీ అబద్దాల పాలన, అసత్య హామీలు , ఎటువంటి సంక్షేమ ఫలాలు అందక విసిగిపోయిన ప్రజల సంక్షేమ కోసం అన్న వస్తున్నాడు...నవరత్నాలు తెస్తున్నాడని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలోని అల్తాప్‌ కల్యాణ మండపంలో గురువారం జరిగిన వైయస్సార్‌సీపీ నవరత్నాల సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, తండ్రి ఆశయ సాధన కోసం పార్టీని స్థాపించాడని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలను ఎటువంటి వర్గబేధాలు లేకుండా రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత కేవలం ఒక్క దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. అటువంటి మహా వ్యక్తి ఆశయ సాధన కోసం , మళ్లీ రాజన్న రాజ్యం రాష్ట్రంలో తీసుకొచ్చేందుకు నిరంతరం ప్రజల కోసం పోరాడే శక్తి వైయస్‌ జగన్‌ గుంటూరు ప్లీనరీ సమావేశంలో ప్రకటించిన నవరత్నాల పథకాలతో మీ ముందుకు త్వరలోనే వస్తున్నాడని కార్యకర్తలను నాయకులను ఉత్సాహపరిచారు. విద్య, వైద్యం కార్పోరేట్‌ పరం చేసేందుకు పూనుకున్న ఈ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిలో ఉందని ఆయన చెప్పారు. వైఎస్‌ పాలనా కాలంలో లక్షల మంది ప్రాణాలను కాపాడిన ఆరోగ్య శ్రీ ఇప్పుడు కార్పోరేట్‌ ఆసుపత్రులకు అమ్మేశారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రైతులకు ఎటువంటి రుణమాపీ చేయకుండా , అంతా చేసేశామంటూ చప్పట్లు కొట్టించుకునే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఇటువంటి విషయాలపై ప్రజలకు బూత్‌లెవల్‌ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ముఖ్యంగా డ్వాక్రా అక్క,చెల్లెమ్మలకు, రైతులకు, విద్యార్థులకు అన్ని విదాల సంక్షేమ పలాలు అందుతాయని ఆయన చెప్పారు. రాబోరు రోజుల్లో ఆయా మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల బాధ్యత పూర్తిగా బూత్‌లెవల్‌ కమిటీలకే అప్పగించడం జరుగుతుందని చెప్పారు. అభివృద్దిలో వారికి భాగస్వామ్యులను చేస్తామని పేర్కొన్నారు. సైనికుల్లా కష్టపడి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ శాతం సీట్లు సాధించుకుని , వైఎస్‌ జగన్‌ను సీఎం చేసే వరకు పోరాటపటిమను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. మొదటగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిత్ర పటానికి నాయకులు నివాళులు అర్పించి సభను ప్రారంభించారు. ఎంతో ఉత్సాహంగా జరిగిన నవరత్నాల సభకు మాజీ ఎమ్మెల్యేలు గడికోట మోహన్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఆవుల విష్ణువర్థన్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు, నాయకులు, బూత్‌ కమిటీ సభ్యులు తరలివచ్చారు.

నాది వైయస్‌ ఇజం... వైయస్‌ఆర్‌ కుటుంబం కోసమే నా జీవితం అంకితం : – గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే
నాది వైయస్‌ ఇజం... వైయస్‌ఆర్‌ కుటుంబం కోసమే నా జీవితం అంకితం. కొందరు అధికార మదంతో , పిచ్చిపట్టి కొన్ని వైబ్‌సైట్లలో, సోషల్‌ మీడియాలో నేను మా పార్టీ మారుతానని ప్రచారం చేస్తున్నారు. పిచ్చి ఆరోపణలకు ప్రతిసారి సమాధానం చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు జీవితం అంతా అబద్ధాల మయం. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లాగా సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి చంద్రబాబు వచ్చి ఉంటే , కనీసం కుప్పంలో కూడా గెలిచేవాడు కాదు. అందుకే ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని లాక్కుని, ఆయనకే వెన్నుపోటు పొడిచాడు. అటువంటి వారు వైయస్సార్‌సీపీని ఏమీ చేయలేరు. నంద్యాల ఎన్నికలతో ఎవరూ నిరాశ చెందలేదు. ఎందుకంటే అక్కడ ప్రజలను అధికారం ఉందనే అహంకారంతో వందల కోట్ల రూపాయలు పెట్టి, ప్రలోభాలకు గురి చేసి టీడీపీ గెలిచింది. దీనికి సాదారణ ఎన్నికలకు పోలికే లేదు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా సీట్లు సాదించి, ఖచ్చితంగా వైఎస్‌ జగన్‌ను సీఎం చేసి తీరుతాం. అంత వరకు వైఎస్సార్‌సీపీ కార్యాచరణ ప్రకారం ముందుకు సాగుతుంది. అందుకు కార్యకర్తలు, రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 2600 మంది బూత్‌ లెవల్‌ కమిటీ సభ్యులు పూర్తి క్రమశిక్షణతో పని చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఇంటికీ నవరత్నాలను తెలియజేయడం, వారిని వైఎస్‌ఆర్‌ కుటుంబంలో చేర్చడం వంటి కార్యక్రమాలు తక్షణం ప్రారంభిస్తాం. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో ప్రజలందరికీ మేలు జరగబోతోంది. పాదయాత్ర ద్వారా జగన్‌ మరిన్ని సమస్యలను తెలుసుకుని ప్రజలకు అవసరమైన అన్ని విదానాలను ప్రకటిస్తారు. పించన్లు 1000 నుంచి రూ.2వేలు పెంచడంతో పాటు , రైతులకు రూ.50వేలు అందించడం, ధరల స్థిరీకరణ నిది కోసం రూ.3వేలు కోట్లు కేటాయించడం, అమ్మ ఒడి, పీజు రియంబర్స్‌ మెంట్‌ ద్వారా విద్యార్థులకు సదుపాయాలు, డ్వాక్రా రుణాలు, జలయజ్జం పేరుతో ప్రాజెక్టుల పూర్తి చేయడం. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలోని వెలిగల్లు, ఝరికోన, శ్రీనివాసపురం ప్రాజెక్టులకు 5 టీఎంసీల నీరు వచ్చే విధంగా హంద్రీ–నీవా కాలువ పూర్తి చేయడమే నా లక్ష్యం.

మళ్లీ రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం : ఆకేపాటి అమరనాథరెడ్డి, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
గతంలో అధికారంలో తొమ్మిదన్నర ఏళ్లు, ప్రస్తుతం మూడున్నర ఏళ్లు టీడీపీ పాలనకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి పాలనకు అసలు పోలికే లేదు. అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా, ఎటువంటి రాజీకీయ జోక్యం లేకుండా 100శాతం సంక్షేమఫలాలు అందించిన ఘనత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిదే. అటువంటి పాలనను రాజన్న రాజ్యంగా పిలిచేవారు. చంద్రబాబు పాలనను అవినీతి పాలనగా పిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్న బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ పిల్లలకు ఫీజురియంబర్స్‌మెంట్‌ పేరుతో అందరికీ చదువుకునే భాగ్యం కల్పించింది వైఎస్‌. అలాగే ఆరోగ్యశ్రీ పేరుతో అందరి ప్రాణాలను కాపాడారు. వీలైనంత మొత్తం ప్రతి రైతుకు రుణమాపీ చేసిన వ్యక్తి వైఎస్‌. మొదటి సంతకంగా ఉచిత విద్యుత్‌ను అందించాడు. కానీ దుర్మార్గపు పాలనగా పేరు తెచ్చుకున్న టీడీపీ పాలనకు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతారు. అంత వర కు క్రమశిక్షణ, అంకిత బావంతో పని చేయాలని, నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.

Back to Top